
వాషింగ్టన్: ఇక నుంచి ప్రతి రోజూ తాను కరోనా టెస్టు చేయించుకుంటానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్‌తో పాటు మిగిలిన స్టాఫ్‌కు కూడా రోజూ టెస్టులు జరుగుతాయన్నారు. తన వ్యక్తిగత మిలిటరీ సిబ్బందికి వైరస్ పాజిటివ్ రావడంతో గురువారం మీడియాతో ఆయన ఈ కామెంట్ చేశారు. ఆ మిలిటరీ సిబ్బందితో తాను చాలా తక్కువగా కాంటాక్ట్అయ్యానని చెప్పారు. అతనికి వైరస్ సోకినట్టు తెలిశాక వైస్ ప్రెసిడెంట్ మైక్‌కు, తనకు టెస్టులు చేశారని వెల్లడించారు. ‘ఈ రోజు నాకు ఆల్రెడీ టెస్టు చేశారు. నిన్న కూడా చేశారు. నెగెటివ్ వచ్చింది’ అన్నారు.
ఇదేం పోలీసింగ్
న్యూయార్క్ సిటీలో సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదంటూ పోలీసులు ఓ ఇద్దరు సిజిజన్లపై దాడి చేసి అరెస్టు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వీడియోలు వైరలయ్యాయి. ఓ వీడియోలో 20 ఏండ్ల నల్ల జాతీయుడిని ఓ పోలీస్ ఆఫీసర్ కింద పడేసి, కదలకుండా పైన కూర్చొని బేడీలు వేశారు. ఇంకో వీడియోలో ఓ వ్యక్తిని పోలీసులు స్టన్ గన్‌తో బెదిరించి తలపై కొట్టి అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ న్యూయార్క్ మేయర్ బిల్ డే మాత్రం ఆ ఘటనలపై చర్యలు తీసుకునేది లేదన్నారు. ఏవో రెండు, మూడు చిన్న చిన్న తప్పులు జరిగినంత మాత్రాన నిర్ణయం తీసుకోలేనని చెప్పారు. మరోవైపు పోలీసులు సోషల్ డిస్టెన్స్ పేరుతో సిటిజన్లపై దాడి చేస్తున్నారని, ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని జనం మండిపడుతున్నారు.
ఏప్రిల్‌లో 2 కోట్ల జాబ్‌లు పోయినయ్
అమెరికాలో లాక్డౌన్ ప్రకటించడంతో కంపెనీలు పని చేయక ఏప్రిల్ నెలలో 2 కోట్లకు పైగా జాబ్‌లు పోయాయని బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ఏప్రిల్‌లో అన్ ఎంప్లాయ్మెంట్ రేటు 14.7 శాతంగా లెక్కగట్టింది. మార్చిలోనూ 8.7 లక్షల జాబ్‌లు పోయాయంది. 2008లో ఆర్థిక సంక్షోభం టైమ్‌లో 80 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, ఇప్పుడు రెండింతలైందని చెప్పింది