అమెరికాలో తెలుగమ్మాయికి న్యాయం కోరుతూ నిరసనలు

అమెరికాలో తెలుగమ్మాయికి న్యాయం కోరుతూ నిరసనలు

అమెరికాలోని సీటెల్లో 23 యేళ్ల జాహ్నవి కందుల పోలీస్ వాహనం ఢీకొని  మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతిపట్ల పోలీసుల నిర్లక్ష్యం, అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో దుమారమే రేగింది. ఈ కేసులో అమెరికా పోలీస్ అధికారిని రక్షించేందుకు పోలీసు యంత్రాంగం యత్నిస్తుండటంతో జాహ్నవి కందుల మద్దతుదారులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. జాన్హవి కందుల మరణం, అధికారి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనకారులు కవాతు చేశారు.

అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పోలీసు వాహనం ఢీకొనడంతో జనవరిలో కందుల మృతి చెందింది. నివేదికల ప్రకారం, అతను ఓవర్ డోస్ యొక్క నివేదికకు వెళ్లే మార్గంలో 119 kmph కంటే ఎక్కువ డ్రైవ్ చేశాడు. అధికారి కెవిన్ డేవ్ నడుపుతున్న పోలీసు వాహనం ఢీకొనడంతో జనవరిలో కందుల మృతి చెందింది. అతివేగంతో కెవిన్ డేవ్ వాహనాన్ని 119నడిపి kmph కంటే ఎక్కువ వేగంతో నడిపి జాహ్నవి మరణానికి కారణమయ్యాడు. 

జాహ్నవి మృతిపై బైడెన్ అడ్మినిస్ట్రేషన్ త్వరితగతిన విచారణ జరిపి, ఘటనకు బాధ్యులైన అధికారులను శిక్షిస్తామని భారత ప్రభుత్వానికి హామీ ఇచ్చింది.