అమెరికాలో ఒక్కరోజే లక్ష దాటిన కరోనా కేసులు

అమెరికాలో ఒక్కరోజే లక్ష దాటిన కరోనా కేసులు

అమెరికాలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గురువారం ఒక్కరోజే లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొలరాడో, ఇదాహో, ఇండియానా, మైనే, మిచిగాన్, మిన్నెసోటా, రోడ్ ఐలాండ్, వాషింగ్టన్ మరియు విస్కాన్సిన్‌ రాష్ట్రాలలో కేసులు విపరీతంగా నమోదైనట్లు సమాచారం. దాంతో అమెరికాలో గురువారం ఒక్కరోజే 1,02,591 కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనావైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో అత్యధిక సంఖ్యలో అమెరికన్లు మెయిల్ పద్ధతిలో తమ ఓటు వేశారు. ఎన్నికల సమయంలో కరోనా కూడా ఒక ప్రధాన సమస్యగా మారింది. వైరస్ ప్రభావం ఇంకా అనేక రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోనే అమెరికా కరోనావైరస్ వల్ల ఎక్కువగా ప్రభావితమైంది. దక్షిణ డకోటా, అయోవా, మరియు వ్యోమింగ్ వంటి రాష్ట్రాల్లో కరోనా తిరిగి విజృంభిస్తోంది. ఇక్కడ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ మొదలైనట్లు హెల్త్ కేర్ వర్కర్లు అంటున్నారు. దక్షిణ డకోటాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 శాతానికి చేరుకుంది. అయోవా మరియు వ్యోమింగ్ రాష్ట్రల్లో 40 శాతానికి చేరుకుంది.

టెక్సాస్‌లో గత 24 గంటల్లో 9,000లకు పైగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 90 రోజులలో ఈ సంఖ్య బాగా పెరిగింది. టెక్సాస్‌లో ఇప్పటివరకు 18,000 మంది మరణించారు. విస్కాన్సిన్ మరియు ఇల్లినాయిస్ రాష్ట్రాల్లో కూడా 6 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో అమెరికాలో 1,130 కరోనా మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసుల సంఖ్యను అరికట్టడానికి డెన్వర్‌లో కర్ఫ్యూ విధించాలని డెన్వర్ మేయర్ మైఖేల్ హాంకాక్ కార్యాలయం నిర్ణయించింది. సిటీలో కఠినమైన ఆంక్షలను విధించారు.

For More News..

హైదరాబాద్ మెట్రో ఎక్కిన వకీల్‌సాబ్..

వీడియో: ‘ఆంటీ’ అన్నందుకు 19 ఏళ్ల యువతిని చితకబాదిన 40 ఏళ్ల మహిళ

దేశంలో కొత్తగా 50,209 కరోనా కేసులు