ఆలూ-హార్ట్: మహిళను చంపి.. గుండెను ఆలుగడ్డలతో కలిపి వండిన ఉన్మాది

ఆలూ-హార్ట్: మహిళను చంపి.. గుండెను ఆలుగడ్డలతో కలిపి వండిన ఉన్మాది

అమెరికాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక మనిషిని చంపి.. గుండె బయటకు తీసి వంట చేసిన ఉన్మాద ఘటన ఓక్లహోమా రాష్ట్రంలో జరిగింది. స్థానిక వార్తపత్రికల ప్రకారం.. లారెన్స్ పాల్ ఆండర్సన్ అనే వ్యక్తి తన ఇంటికి పొరుగింట్లో ఉండే మహిళపై కత్తితో దాడిచేసి చంపాడు. ఆ తర్వాత ఆమె గుండెను బయటకు తీసిన లారెన్స్.. తన అంకుల్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ గుండెను.. ఆలుగడ్డలతో కలిపి వంట చేశాడు. ఆ పదార్థాన్ని తన అంకుల్ మరియు ఆంటీలకు వడ్డించి బలవంతంగా తినిపించాడు. ఆ తర్వాత లారెన్స్ తన అంకుల్ మరియు ఆయన నాలుగేళ్ల మనవరాలిని చంపేశాడు. ఈ క్రమంలో ఆంటీపై కూడా తీవ్రంగా దాడిచేశాడు.

లారెన్స్ 2017 మాదకద్రవ్యాల కేసులో అరెస్ట్ అయ్యాడు. ఆ కేసుకు సంబంధించి ఆయనకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. అయితే
ఓక్లహోమా గవర్నర్ క్షమాభిక్షతో లారెన్స్ ఈ మధ్యే విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలయిన కొన్ని వారాలకే ఈ దారుణానికి ఒడిగట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. లారెన్స్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా.. నేరం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

For More News..

నాలుగు గంటలు పనిచేయని స్టాక్ ఎక్స్చేంజ్‌..

సిటీలో ఎక్కడి చెత్త అక్కడే.. కంప్లయింట్స్ చేస్తున్నా పట్టించుకోని అధికారులు