కాగ్నానది నీటిని వాడుకోండి : అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ

కాగ్నానది నీటిని వాడుకోండి :  అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ

వికారాబాద్, వెలుగు : సమ్మర్ లో అత్యావసరమైతే ప్రజలకు తాగునీటిని సరఫరా చేసేందుకు కాగ్నా నది నీటిని వాడుకునేలా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. గురువారం తాండూర్ పరిధిలోని కాగ్నా నది  వద్ద పంపు హౌస్ ను పరిశీలించారు.  వేసవిలో మిషన్ భగీరథ నీరు అనుకోని పరిస్థితుల్లో నిలిచిపోతే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయంగా కాగ్నా  నీటిని వాడుకోవాలని అధికారులకు సూచించారు. నదిలో పేరుకుపోయిన చెత్త చెదారం ఎప్పటికప్పుడు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట మిషన్ భగీరథ తాండూర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగేశ్వరరావు, డీఈ శశాంక్  మిశ్రా ఉన్నారు.