IND vs AUS : రాణించిన ఆస్ట్రేలియా.. ఖవాజా సెంచరీ 

IND vs AUS : రాణించిన ఆస్ట్రేలియా.. ఖవాజా సెంచరీ 

భారత్ తో జరిగిన నాలుగో టెస్టులో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో రాణించింది. భారత బౌలర్ల దాటిని ఎదుర్కొని 255/4 తో పటిష్టమైన స్థితిలో నిల్చుంది. ఆసీస్ ఓపెనర్ ఖవాజా సూపర్ సెంచరీతో (104, 251 బంతుల్లో) ఆకట్టుకుంన్నాడు. ట్రావిస్ హెడ్ (32), స్టీవ్ స్మిత్ (38), కమేరున్ గ్రీన్ (49నాటౌట్) రాణించడంతో ఆసీస్ 250 స్కోర్ దాటింది. భారత బౌలర్లలో షమీ 2, జడేజా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు. 

టీమిండియా బౌలర్లు దాడి చేసినా..

ఇన్నింగ్స్ మొదటినుంచి టీమిండియా బౌలర్లు ఆసీస్ బ్యాట్స్ మెన్ పై దాడి చేస్తూనే ఉన్నారు. తొలి సెషన్ లో ట్రావిస్ హెడ్ ను అశ్విన్ ని ఔట్ చేసిన తర్వాత, మూబో వికెట్ లో వచ్చిన లంబుచనే (3)ను వెంటనే షమీ ఔట్ చేశాడు. దీంతో టీమిండియా మరోసాకి ఆదిపత్యం ప్రదర్శిస్తుంది అనుకున్నారంతా. తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ స్మి్త్, ఓపెనర్ ఉస్మార్ ఖవాజాతో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టారు. పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తున్నా బౌలర్ల దాడిని ఎదుర్కొంటూ నిలబడ్డారు. 79 పరుగుల భాగస్వామ్యంతో మూడో సెషన్ మొదలుపెట్టిన ఆసీస్ ను జడేజా దెబ్బకొట్టాడు. స్మిత్ ను పెవిలియన్ చేర్చి బ్రేక్ ఇచ్చాడు. ఐదో వికెట్లో వచ్చిన పీటర్ హ్యాండ్ స్కోంబ్ (17)ను షమీ బోల్డ్ చేసి నాలుగో వికెట్ పడగొట్టాడు. 

ఖవాజా, గ్రీన్ నిలబడ్డారు

తర్వాత వచ్చిన గ్రీన్ (49 నాటౌట్).. ఖవాజా(104 నాటౌట్)తో కలిసి ఇన్ని్ంగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. ఆస్ట్రేలియాను 250 మార్క్ దాటేందుకు సాయపడ్డారు. అయితే, ఈ సిరీస్ లో ఓ ఇన్నింగ్స్ లో అత్యధిక పరుగుల చేయడం ఇదే తొలిసారి. ఒక టీం పూర్తి రోజంతా బ్యాటింగ్ చేయడం కూడా ఇదే మొదటిసారి.