శరవేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్..

శరవేగంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్..

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ‘గబ్బర్ సింగ్’ తర్వాత రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్‌‌‌‌‌‌‌‌సింగ్’.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా  కొత్త షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ పూర్తయినట్టు దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియా ద్వారా అప్‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సపోర్ట్‌‌‌‌‌‌‌‌తో సక్సెస్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌‌‌‌‌గా షెడ్యూల్ కంప్లీట్ చేసినట్టు తెలియజేస్తూ..  ఓ ఫొటోను షేర్ చేశారు. ఇందులో హరీష్ శంకర్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కూర్చోగా, తన వెనుక పవన్ కళ్యాణ్ నిలబడి కనిపిస్తున్నారు. 

ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్  చేసిన హరీష్.. ‘మాటిస్తే... నిలబెట్టుకోవడం, మాట మీదే నిలబడ్డం, మీరు పక్కనుంటే కరెంట్ పాకినట్టు’ అంటూ పోస్ట్ చేశాడు.  ఇందులో పవన్ స్టైలిష్  పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.  శ్రీలీల, రాశీ ఖన్నా  హీరోయిన్స్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్నారు. పార్థిబన్, కేఎస్ రవికుమార్, రాంకీ, నవాబ్‌‌‌‌‌‌‌‌ షా, 'కేజీఎఫ్' ఫేమ్ అవినాష్,  నాగ మహేశ్, టెంపర్ వంశీ  కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.