ఎమ్మెల్సీ ఎన్నికలపై కోర్టుకు వెళతాం: ఉత్తమ్

ఎమ్మెల్సీ ఎన్నికలపై కోర్టుకు వెళతాం: ఉత్తమ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై కోర్టుకు వెళతామన్నారు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ రోజు అఖిలపక్షం ఆధ్వర్యంలో సీఈవో రజత్ కుమార్ ను కలసిన ఆయన.. మంగళవారం ప్రకటించిన ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ , నోటిఫికేషన్ పై ఫిర్యాదు చేశారు. పోలింగ్ ను రెండు వారాల పాటు వాయిదా వేయాలని ఈసీని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న జెడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల అనంతరమే ఎమ్మెల్సీ ఎన్నికలు జరపాలని కోరారు. కొత్త ఎంపీటీసీ, జెడ్పీటీసీ లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు.

నిన్న రాత్రి షెడ్యూల్ ఇచ్చి, ఈ రోజు ఉదయం నోటిఫికేషన్ ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తుందన్నారు. నోటిఫికేషన్ వస్తుందని ముందే తెలిసినట్లు టిఆర్ఎస్ పార్టీ వెంటనే  తమ అభ్యర్థులను ప్రకటించిందని ఉత్తమ్ ఆరోపించారు.