ఫస్ట్ కిస్‌ మామూలుగుండదు మామా.. ఆకట్టుకుంటున్న ఉత్సవం పాట

ఫస్ట్ కిస్‌ మామూలుగుండదు మామా.. ఆకట్టుకుంటున్న ఉత్సవం పాట

దిలీప్ ప్రకాష్(Dileep Prakash), రెజీనా కసాండ్రా(Regina Cassandra) లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో తెరకెక్కుతున్న చిత్రం ఉత్సవం(Uthsavam). అర్జున్ సాయి(Arjun Sai) దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ పాటిల్(Suresh Patil) నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌, టీజర్‌‌‌‌‌‌‌‌తో ఆకట్టుకున్న మేకర్స్, మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు. ‘ఫస్ట్ కిస్‌‌‌‌‌‌‌‌’ అనే పాటను శనివారం విడుదల చేశారు.

‘మామూలుగుండదు మావా.. కిక్కు మామూలుగుండదు మామా.. ఫస్ట్ కిస్ అంటే పండగే బావ, డ్రగ్గులెన్నైన దండగే దేవ, ఎక్కినాదంటే దిగదిక యావ’ అంటూ హీరో తన ఫస్ట్‌‌‌‌‌‌‌‌ కిస్‌‌‌‌‌‌‌‌ అనుభవాన్ని చెబుతున్నట్టుగా ఈ పాట రాశారు అనంత శ్రీరామ్. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ట్యూన్, రామ్ మిరియాల గాత్రం ఆకట్టుకున్నాయి. వీడియో సాంగ్‌‌‌‌‌‌‌‌లో దిలీప్ ప్రకాష్ తన డ్యాన్స్, ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెషన్స్‌‌‌‌‌‌‌‌తో ఇంప్రెస్‌‌‌‌‌‌‌‌ చేశాడు. రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, నాజర్, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, ప్రియదర్శి, ఆమని, సుధ ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ త్వరలో విడుదల కానుంది.