నేనూ సీఎం రేసులో ఉన్నా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

నేనూ సీఎం రేసులో ఉన్నా: ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా.. సీఎం ఎవరనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. దీనికి కారణం.. సీఎం రేసులో ముగ్గురు నలుగురు నాయకులు ఉండటమే. దీంతో ఎవరినీ సీఎం చేయాలనే విషయంలో అధిష్టానం చర్చలు జరుపుతోంది. ఇందులో భాగంగానే అధిష్టానం పిలుపు మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టీ విక్రమార్క డిసెంబర్ 5వ తేదీ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు.కేసీ వేణుగోపాల్ నివాసంలో భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.   ముఖ్యమంత్రి అభ్యర్థి పరిశీలనలో తాను కూడా ఉన్నానని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్స్:

  • మొదటి నుంచి తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా.
  • నేనూ సీఎం రేసులో ఉన్నా.
  • నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. నా అభిప్రాయం హైకమండ్ కు చెప్పా.
  • హైకమండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటా.
  •  నలుగురు ఐదుగరు సీఎం రేసులో ఉండటం తప్పు కాదు.
  • ప్రజాస్వామ్య పద్దతిలో  కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎన్నిక జరుగుతుంది.
  • ఎక్కడా గందరగోళం లేదు...ఎన్నికల్లో 70 నుంచి 75 సీట్లు వస్తాయని ఆశించాం.
  • పార్టీ అంతర్గత విషయాలు బయట చెప్పడం తప్పు.
  • నేను పీసీసీగా ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఇంత లేదు. అందుకే 2018లో మేము ఓడిపోయాం.
  • ప్రభుత్వ వ్యతిరేకతతోనే ఈసారి గెలిచాం.