నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను ఆపాలని డిమాండ్ చేస్తూ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. చెంచుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ పర్యావరణానికి ముప్పు గా ఉన్న యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వవద్దని లేఖలో కోరారు ఉత్తమ్. మరోవైపు ఈ నెల 20 న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 75 వ జయంతి వేడుకల ఏర్పాట్లపై పీసీసీ ముఖ్య నేతలతో మాట్లాడారు ఉత్తమ్. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, పలువురు DCCలు, ముఖ్య నేతలు మీటింగ్ కు హాజరయ్యారు.
