67కు చేరుకున్న ఉత్తరాఖంఢ్ మృతుల సంఖ్య

67కు చేరుకున్న ఉత్తరాఖంఢ్ మృతుల సంఖ్య
  • మరో రెండు డెడ్​బాడీల వెలికితీత

గోపేశ్వర్(ఉత్తరాఖంఢ్): ఉత్తరాఖంఢ్​లో మంచుకొండ విరిగి పడి వరదలు వచ్చిన ఘటనలో మృతుల సంఖ్య 67కు చేరుకుంది. చమోలి జిల్లాలోని తపోవన్ హైడల్ ప్రాజెక్టు సైట్​లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి తర్వాత రెండు డెడ్​బాడీలు వెలికితీసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య ఆదివారం నాటికి 67 కు చేరుకుంది. ఇంకా 137 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. శనివారం సాయంత్రం తపోవన్ ప్రాజెక్ట్ బ్యారేజీ దగ్గరలో ఉన్న డీసిల్టింగ్ ట్యాంక్ నుంచి మూడు డెడ్​బాడీలను స్వాధీనం చేసుకున్నారు. అదనపు ఎక్స్​కవేటర్లను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్ మరింత స్పీడప్ చేయాలని, తపోవన్ టన్నెల్ లోకి నీళ్లు వెళ్లకుండా ధౌలిగంగా నదీ ప్రవాహ మార్గాన్ని మరోవైపుకు మళ్లించాలని ఎన్టీపీసీ అధికారులను చమోలి జిల్లా కలెక్టర్ స్వాతి ఎస్ బదౌరియా కోరారు.

ఇవి కూడా చదవండి

నేతలకు సవాల్ విసురుతున్న వరుస ఎన్నికలు

బెల్లంపల్లిలో మరో ల్యాండ్​ స్కామ్

2 వేల కోట్లతో సింగూరుపై రెండు భారీ ఎత్తిపోతలు

వెల్లుల్లి క్యాప్సూల్స్ తయారీ యోచనలో ఉద్యాన శాఖ