ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రుద్రప్రయోగ్ లోని బ్రదీనాథ్ హైవే సమీపంలో అదుపుతప్పి టెంపో వాహనం లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మరి కొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో టెంపోలో 17 మంది ప్రయాణిస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చిన NDRF, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. లోయలో నుంచి ఇద్దరిని బయటకు తీశారు. తీవ్రంగా గాయపడ్డ వీరిని హాస్పిటల్ కు తరలించారు.
మరోవైపు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్స సింగ్ ధామి స్పందించారు. NDRF, పోలీసులు సహాయక చర్యలు చేస్తున్నారని ట్వీట్ చేశారు. ప్రమాదంపై విచారణ చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ ను ఆదేశించారు.
#WATCH | Uttarakhand: 8 people died when a tempo traveller fell into a deep gorge near Badrinath Highway in Rudraprayag. Rescue operation underway.
— ANI (@ANI) June 15, 2024
(Video: SDRF) pic.twitter.com/vBAQCnioyO