
నేను అంతకుముందు వేరే చానెల్‌ల న్యూస్ ప్రజెంటర్‌గా చేస్తుండె. వీ6కు కూడా యాంకర్‌గనే వచ్చినా కానీ, తీన్మార్‌కు బాగుంటదని తీసుకున్నరు. ఫస్టు వాయిస్ ఓవర్లు చేయించిన్రు. ఆ తర్వాత పద్మ క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన్రు. వార్తలు చదవడం వచ్చుగానీ, యాక్టింగ్ అంటే అమ్మో, అస్సలు తెల్వదు. పద్మగా కనిపించినంక, యాక్టింగ్ నేర్చుకున్న. ఈ టైమ్‌ల నాకు తీన్మార్ టీమ్ నుంచి వచ్చిన సపోర్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తీన్మార్ టీం అంతా ఒక ఫ్యామిలీ లెక్క ఉంటం. నన్ను బయట కూడా అందరూ పద్మ లెక్కనే గుర్తు పట్టడం హ్యాపీగా ఉంటది.
– పద్మ