
కార్తి హీరోగా నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘వా వాతియార్’. కృతి శెట్టి హీరోయిన్. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
యాక్షన్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, ఎంజీఆర్ అభిమానిగా కార్తి కనిపించనున్నాడు. సత్యరాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా రాజ్ కిరణ్, మధుర్ మిట్టల్, ఆనంద రాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.