18 ఏండ్లు దాటిన వాళ్లకే టీకా

18 ఏండ్లు దాటిన వాళ్లకే టీకా

గర్భిణులకు, బాలింతలకు వేయొద్దు

ఫస్ట్​ డోస్​ ఏ కంపెనీ వ్యాక్సిన్​ వేస్తే.. సెకండ్​ డోస్​ కూడా అదే

కరోనా వ్యాక్సినేషన్​పై కేంద్రం గైడ్​లైన్స్​

దేశవ్యాప్తంగా శనివారం నుంచి కరోనా వ్యాక్సినేషన్​ స్టార్ట్​ కానున్నందున శుక్రవారం కేంద్రం గైడ్​లైన్స్​ విడుదల చేసింది. ఎవరికి టీకా వేయాలి? ఎవరికి వేయొద్దు? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? అందులో వివరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సెంట్రల్​ హెల్త్​ మినిస్ట్రీ లెటర్లు రాసింది. గైడ్​లైన్స్​లోని
ముఖ్యాంశాలు…

ఇవీ గైడ్​లైన్స్​

  •     గర్భిణులకు, బాలింతలకు వేయొద్దు. వీరిపై కరోనా వ్యాక్సిన్​ క్లినికల్​ ట్రయల్స్​ ఇంతవరకు జరగలేదు.
  •     18 ఏండ్లు దాటిన వారికి మాత్రమే వ్యాక్సినేషన్​ ఉంటుంది. దీన్ని కచ్చితంగా పాటించాలి.
  •     కరోనా వ్యాక్సిన్​ వేసుకున్న వారికి వేరే ఇతర వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంటే రెండు టీకాల మధ్య తప్పకుండా 14 రోజుల గ్యాప్​ ఉండాలి.
  •     ఏ సంస్థకు చెందిన కరోనా వ్యాక్సిన్​ ఫస్ట్​ డోస్​లో వేసుకుంటే.. రెండో డోస్​లో కూడా అదే సంస్థ వ్యాక్సిన్​ వేసుకోవాలి.  ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్​ వ్యాక్సిన్లకు అనుమతిచ్చారు. ఫస్ట్​ డోస్​లో కొవిషీల్డ్​ వేసుకుంటే.. సెకండ్​ డోస్​లో కూడా అదే టీకా వేసుకోవాల్సి ఉంటుంది.
  •     వ్యాక్సిన్​ వేసుకునేవారి హెల్త్​ హిస్టరీని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. వారికి మందులు, టీకా, ఫుడ్​ ఐటమ్స్​ఎలర్జీ ఉంటే.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.
  •     ప్లాస్మా, యాంటీబాడీల ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న కరోనా పేషెంట్లకు వారు కోలుకున్న తర్వాత కనీసం నాలుగు నుంచి ఎనిమిది వారాల తర్వాతే టీకా ఇవ్వాలి.
  •     ఇప్పటికే కరోనా బారినపడితే.. దాని నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే వ్యాక్సిన్​ వేస్తారు.
  •     కరోనా నుంచి కోలుకున్న వారు తమకు నెగెటివ్ వచ్చిన 4 నుంచి 8 వారాల తర్వాతే  వ్యాక్సిన్ వేసుకోవాలి.
  •     కొవిషీల్డ్ వ్యాక్సిన్‌‌ వేసిన చోట కొంచెం నొప్పి ఉంటుంది. తలనొప్పి, మజిల్ పెయిన్​, అలసట, జ్వరం, వణుకు, కీళ్ల నొప్పి రావచ్చు.
  •     కొవాగ్జిన్ వ్యాక్సిన్ వేసిన చోట కూడా నొప్పి ఉంటుంది. కొద్దిగా వాపు రావొచ్చు. తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, చెమటలు పట్టడం, జలుబు చేయడం, దగ్గు వంటి రావొచ్చు.ఈ లక్షణాలు కనిపిస్తే భయపడాల్సిన పని లేదు.
  •     వ్యాక్సిన్​ వేసుకున్న తర్వాత జ్వరం లాంటివి ఉంటే పారాసిటమాల్​ ట్యాబ్లెట్లను వాడొచ్చు.
  • వ్యాక్సినేషన్​పై సందేహాలను తొలగించేందుకు ప్రత్యేక హెల్ప్​ లైన్​ 1075 టోల్​ఫ్రీ నంబర్​ ఏర్పాటు.

ఇవీ చదవండి

పోషక విలువలున్నాయని ఎక్కువగా తింటే..

జూనియర్ బ్యాడ్మింటన్‌ ర్యాంకింగ్స్: సామియా @ వరల్డ్‌ నెంబర్-2

నెట్ బౌలర్‌గా వెళ్లి 3 ఫార్మాట్లలో అరంగేట్రం

లాండ్​లైన్​ నుంచి మొబైల్​కు కాల్​ చేయాలంటే ఇలా చేయాల్సిందే!