జనవరి నుంచే వ్యాక్సిన్ పంపిణీ : పూనావాలా

జనవరి నుంచే వ్యాక్సిన్ పంపిణీ : పూనావాలా

వచ్చే ఏడాది జనవరి నుంచి భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్ ఇండియా అదార్‌ పూనావాలా  తెలిపారు. నేషనల్ మీడియా కథనం ప్రకారం.. జనవరి నుంచి ఇండియాలో వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన వెంటనే ప్రత్యేకంగా డ్రైవ్ ను ప్రారంభిస్తామన్నారు.  కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు జనవరి నుంచి ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించి అక్టోబర్ 2021 నాటికి దేశం మొత్తం ప్రజలకు వ్యాక్సిన్ ను అందిస్తామన్నారు. డిసెంబర్ నెల చివరి నాటికి అత్యవసర పరిస్థితుల కింద కరోనా వ్యాక్సిన్ ను పంపిణీ చేసేందుకు కేంద్రం తమకు  అనుమతి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం మొత్తంలో 20శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందిస్తే సెప్టెంబర్ – అక్టోబర్ నాటికి  సాధారణ జీవితం పొందగలుగుతామని అన్నారు.