భారత్ కరోనా నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం

భారత్ కరోనా నుంచి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం

వాషింగ్టన్: కరోనా బారి నుంచి భారత్ బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని అమెరికా పబ్లిక్ హెల్త్ ఎక్స్‌‌పర్ట్ డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు. మహమ్మారిపై పోరును మరింత బలోపేతం చేసేందుకు వ్యాక్సిన్స్ చాలా అవసరమని, వెంటనే ప్రపంచవ్యాప్తంగా టీకాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు. 

‘ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇస్తేనే భారత్‌‌కు కరోనా వైరస్ ముప్పు తొలగుతుంది.  వ్యాక్సినేషన్ పూర్తయితే మహమ్మారి ఖేల్ ఖతం అవుతుంది. ప్రపంచంలో వ్యాక్సిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న దేశం భారత్. అందుకు కావాల్సిన వనరులను దేశీయంగా, అలాగే ఇతర దేశాల నుంచి ఇండియా తెచ్చుకుంది. ఇకపోతే, ఇండియాలోని హాస్పిటల్స్‌‌లో బెడ్స్ కొరత తీవ్రంగా ఉంది. దీని నుంచి బయటపడాలంటే భారత్ చైనా మోడల్‌ను ఫాలో అవ్వాలి. తాత్కాలిక ఆస్పత్రులను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలి. వైరస్ వ్యాప్తిని నియంత్రించాలంటే వెంటనే లాక్‌‌డౌన్ పెట్టాలి. భారత్‌లో ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ దిశగా నిర్ణయం తీసుకున్నాయి’ అని ఫౌసీ పేర్కొన్నారు.