వచ్చే ఏడాదికే వ్యాక్సిన్.. ఇప్పట్లో లేనట్లే!

వచ్చే ఏడాదికే వ్యాక్సిన్.. ఇప్పట్లో లేనట్లే!

కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్దన్ వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకీ ఎక్కువవుతోంది. దేశంలో ప్రతి రోజూ వేలాది కేసులు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇండియాలో కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు అందబాటులోకి వస్తుందనే విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ పార్లమెంట్ సెషన్‌‌లో క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది ప్రథమార్థానికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని హర్ష వర్దన్ చెప్పారు. అయితే ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేయడానికి కొంత సమయం పడుతుందన్నారు. భారత్‌‌లో తొలి కేసు నమోదవ్వడానికి ముందే వ్యాక్సిన్ పరిశోధన దిశగా చర్యలకు ఆదేశించామన్నారు. జనవరి 8న నిపుణుల బృందంతో కలసి ఈ విషయంపై చర్చించామని, అదే నెల 17న పలు సూచనలు, సన్నద్ధతతో ముందుకు వెళ్లాల్సిందిగా నిర్ణయించామన్నారు. మైగ్రంట్ వర్కర్స్ ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం వాస్తవమేనని, అదే సమయంలో వారికి అన్ని సదుపాయాలు కల్పించామని తెలిపారు. 64 లక్షల వలస కూలీలను బస్సులు, రైళ్లలో వారి ఇళ్లకు చేర్చామన్నారు.