కొరియర్ సర్వీసుల సంస్థ… DHL ఎక్స్‌ప్రెస్ ప్రపంచంలో ఏ దేశానికైనా 1 నుంచి 5 రోజుల్లోగా వ్యాక్సిన్లను సరఫరా చేయగలమని చెప్పింది. తమ సర్వీసులు విస్తరించిన 220 దేశాలకు కరోనా వ్యాక్సిన్లను డెలివరీ చేయగలమంది. మైనస్ 75 డిగ్రీలలోనూ వ్యాక్సిన్ల రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. కొద్ది నెలలుగా ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్.. సెకండ్‌వేవ్‌లో భాగంగా అమెరికా, యూరోపియన్ దేశాలలో ఇటీవల భారీగా విస్తరిస్తోంది. దీంతో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఎమర్జెన్సీ ప్రాతిపదికన యూకే ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను -75 సెల్షియస్‌లో నిల్వ చేయవలసి ఉండటంతో DHL ఎక్స్‌ప్రెస్ ఏర్పాట్లకు ప్రాధాన్యత ఏర్పడినట్లు ఫార్మా వర్గాలు తెలిపాయి.
