వ్యాక్సిన్ అందరికీ కాదు.. 30 ప్లస్ వాళ్లకు మాత్రమే..

వ్యాక్సిన్ అందరికీ కాదు.. 30 ప్లస్ వాళ్లకు మాత్రమే..

గ్రేటర్ పరిధిలో చేస్తున్న వాక్సినేషన్ డ్రైవ్‌లో గందరగోళం ఏర్పడింది. ఈ రోజు నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా జీహెచ్ఎంసీ అధికారులు 100 వాక్సిన్ కేంద్రాల్లో వాక్సినేషన్ చేస్తున్నారు. వ్యాక్సిన్‌కు వచ్చే వాళ్లు సెల్ఫ్ రిజిస్ట్ర్రేషన్ చేసుకొని రావాలని తెలిపారు. దాంతో 18 ఏళ్లు పైబడిన వారందరికీ రిజిస్ట్రేషన్ అవుతోంది. దాంతో చాలామంది రిజిస్టేషన్ చేసుకొని వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్తున్నారు. అయితే అక్కడ మాత్రం 30 ఏళ్లు పైబడిన వారికే వ్యాక్సిన్ ఇస్తామని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. దాంతో 30 ఏళ్లు లోపు వయసున్న వారిని వ్యాక్సిన్ కేంద్రాల నుంచి వెనుకకు పంపుతున్నారు. దాంతో 18 ఏళ్లు పైబడిన వారు అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. వ్యాక్సిన్ అందరికీ ఇవ్వనప్పుడు ముందుగా తెలియజేస్తే బాగుండేదని.. మా టైం వేస్ట్ చేసుకునే వాళ్లం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.