హ్యూమన్​ ట్రయల్స్​ దశలో కరోనా వ్యాక్సిన్!

హ్యూమన్​ ట్రయల్స్​ దశలో కరోనా వ్యాక్సిన్!
  • ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రయోగాలు
  • రెండు కంపెనీల వ్యాక్సిన్లపై హ్యూమన్​ ట్రయల్స్
  • ప్రీక్లీనికల్​ స్టేజ్​లో మరో 60
  • ఇండియాలో వ్యాక్సిన్​ తయారు చేస్తున్న రెండు కంపెనీలు

న్యూఢిల్లీ: ప్రస్తుతం కరోనా వైరస్​ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆన్​లైన్​లో అందుబాటులో ఉన్న వైరస్​కు సంబంధించిన జెనెటిక్​ ఇన్ఫర్మేషన్​ ఆధారంగా ఇప్పటికే పలు దేశాల ప్రభుత్వాలు, ప్రైవేట్​ సంస్థలు, ఎడ్యుకేషనల్​ ఇనిస్టిట్యూట్స్, నాన్​ ప్రాఫిట్​ ఆర్గనైజేషన్లు కూడా కోవిడ్​ –19 వ్యాక్సిన్​ కనిపెట్టేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏప్రిల్​ 4న వరల్డ్ హెల్త్​ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్​వో) ‘‘డ్రాఫ్ట్​ ల్యాండ్ స్కేప్​ ఆఫ్ కోవిడ్​ 19 క్యాండిడేట్​ వ్యాక్సిన్స్” డాక్యుమెంట్​ను రిలీజ్ చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం రెండు వ్యాక్సిన్లకు సంబంధించి హ్యూమన్​ ట్రయల్స్​ జరుగుతున్నాయి.

నాన్​ రెప్లికేటింగ్​ వైరల్​ వెక్టర్​ వ్యాక్సిన్
కాన్​సినో బయోలాజికల్​ సంస్థ నాన్​ రెప్లికేటింగ్​ వైరల్​ వెక్టర్​ వ్యాక్సిన్​ను డెవలప్​ చేసింది. బీజింగ్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్ బయో టెక్నాలజీ సాయంతో ఈ వ్యాక్సిన్​ను తయారు చేసింది. నాన్​ రెప్లికేటింగ్​ వైరల్​ వెక్టర్​ వ్యాక్సిన్​ను చనిపోయిన వైరస్​ నుంచి లేదా వైరస్​లోని ఓ పార్ట్​ ఆధారంగా డెవలప్​ చేస్తారు. ఇది పూర్తిస్థాయి వైరస్​ కాకపోయినా.. దాని యాంటిజెన్స్​ మన ఇమ్యూన్​ సిస్టంలో యాంటీబాడీస్​ను ప్రొడ్యూస్​ చేసేందుకు ఉపయోగపడతాయి. ఇవి భవిష్యత్​లో మనం కరోనా వైరస్​ బారిన పడితే దానితో పోరాడేందుకు సహాయపడతాయి. చైనీస్​ క్లీనికల్​ ట్రయల్​ రిజిస్ట్రీ డేటా ప్రకారం.. 18 నుంచి 60 ఏండ్ల వయసున్న మగ, ఆడవారిపై టెస్టులు కొనసాగుతున్నాయి. ఒక్కో గ్రూపులో 36 మందితో మూడు గ్రూపులుగా ఈ టెస్టులు చేస్తున్నారు. హై, మీడియం, లో డోసేజ్​తో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మెసెంజర్​ ఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్
ఇక రెండోది మెసెంజర్​ ఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్. దీనిని మోడర్నా అండ్​ నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ అలెర్జీ అండ్​ ఇన్ఫెక్టియస్​ డిసీజెస్​ డెవలప్​చేసింది. ఆర్​ఎన్​ఏ వ్యాక్సిన్​లో పాథోజెన్​ నుంచి తీసిన మెసెంజర్​ ఆర్ ఎన్​ఏని వాడతారు. ఈ మెసెంజర్​ ఆర్​ఎన్​ఏ.. మన ఇమ్యూన్​ సెల్స్, యాంటీబాడీస్​ ఆధారంగా యాంటీ ప్రొటీన్​గా మార్పుచెందుతుంది. కానీ, ఈ మెసెంజర్​ ఆర్​ఎన్​ఏ స్టేబుల్​గా ఉండదు. అందువల్ల దీనిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అందువల్ల దానిని లిపిడ్​ నానో పార్టికల్(ఎల్​ఎన్​పీ)లో ఉంచుతారు. ఈ ఎల్​ఎన్​పీ అనేది మెసెంజర్​ ఆర్​ఎన్​ఏని డెవివర్​ చేసే కారకంగా పనిచేస్తుంది. క్లీనికల్​ ట్రయల్స్.జీవోవీ వెబ్​సైట్​ ప్రకారం.. 18 నుంచి 55 ఏండ్ల వయసు కలిగిన 45 మంది మగ, ఆడవారిని మూడు గ్రూపులుగా చేసి టెస్టులు చేస్తున్నారు. వారికి ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ ద్వారా కండరాల్లోకి వ్యాక్సిన్​ను ఎక్కిస్తారు. డే 1, డే 29న ఈ ఇంజెక్షన్​ చేస్తారు.

ఇండియాలో వ్యాక్సిన్ల తయారీ ఇలా..
ఏప్రిల్​ 9న నేచుర్​ రివ్యూస్​ డ్రగ్​ డిస్కవరీలో పబ్లిష్ అయిన కొయిలిషన్​ ఫర్​ ఎపిడమిక్​ ప్రిపేర్డ్​నెస్​ ఇన్నోవేషన్స్(సీఈపీఐ) నోట్స్​ ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 115 వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో 78 కన్ఫర్మ్​ చేసినవి కాగా.. 37 డెవలప్​మెంట్​ స్టాటస్​ను కన్మర్మ్​ చేయనివి. ప్రీక్లీనికల్​ స్టేజ్​లో మరో 60 వ్యాక్సిన్లు ఉన్నాయి. డబ్ల్యూహెచ్​వో ప్రకటించిన రెండు కాకుండా.. ఐనోవియో ఫార్మాసుటికల్స్​కు చెందిన ఒక వ్యాక్సిన్, షెన్​ జెన్​ జీనో ఇమ్యూనీ మెడికల్​ ఇనిస్టిట్యూట్​కు చెందిన రెండు వ్యాక్సిన్లు కూడా ఈ లిస్ట్​లో ఉన్నాయి. ఇందులో ఇండియాకు చెందిన ఫార్మాసుటికల్​ కంపెనీలు జైడూస్​ కాడిలాకు చెందిన డీఎన్​ఏ ప్లాస్మిడ్​ వ్యాక్సిన్, సీరం ఇనిస్టిట్యూట్​ ఆఫ్ ఇండియాకు చెందిన లైవ్​ అటెన్యుయేటెడ్​ వైరస్​ వ్యాక్సిన్​ కూడా ఉన్నాయి. డీఎన్ఏ వ్యాక్సిన్​ తయారు చేయడం చాలా సులభం. స్టోర్​ చేయడం, ట్రాన్స్​పోర్ట్ చేయడం ఈజీ. తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చు.