సీసీసీ, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్లు  

V6 Velugu Posted on Jun 07, 2021

గతేడాది కరోనా సమయంలో టాలీవుడ్ సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ చారిటీ (CCC) ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రోత్సాహంతో కార్యరూపం దాల్చిన CCC సినీ కార్మికులను అనేక విధాలుగా ఆదుకుంది. ప్రస్తుతం CCC,చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సినీ కార్మికులకు కరోనా వ్యాక్సిన్లు అందిస్తున్నారు. దీని ప్రారంభ కార్యక్రమంలో చిరంజీవి కూడా పాల్గొన్నారు.

అపోలో 24/7 వైద్య సంస్థ సహకారంతో ఈ వ్యాక్సినేషన్ ఇవాళ్టి(సోమవారం) నుంచి ప్రారంభమైనట్లు  చిరంజీవి తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో తెలుగు సినీ ఇండస్ట్రీలోని 24 విభాగాల కార్మికులు, 'మా' సభ్యులు, సినీ జర్నలిస్టులందరికీ టీకాలు అందించనున్నట్లు చెప్పారు.

Tagged ccc, Chiranjeevi Charitable Trust, Vaccines film workers

Latest Videos

Subscribe Now

More News