జయశంకర్భూపాలపల్లి, వెలుగు: అన్ని రంగాల్లో భూపాలపల్లి జిల్లా ప్రగతికి బాటలు వేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం, ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేండ్లల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి భూపాలపల్లి మున్సిపాలటీకి రూ.50 కోట్లు మంజురు చేశారని, ఆయా పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలువాలని కోరారు. రేగొండ మండలం కోటంచ ఆలయ పున:ప్రారంభం పనులపై ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. టార్గెట్ మేరకు పనులు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, నాయకులు చల్లూరి మధు, అప్పం కిషన్, దేవన్ పాల్గొన్నారు.
