VaddeNaveen: వడ్డే నవీన్ స్ట్రాంగ్ కమ్‌‌‌‌బ్యాక్.. కథ, స్క్రీన్‌‌‌‌ప్లేతో పాటు హీరోగా

VaddeNaveen: వడ్డే నవీన్ స్ట్రాంగ్ కమ్‌‌‌‌బ్యాక్.. కథ, స్క్రీన్‌‌‌‌ప్లేతో పాటు హీరోగా

ఒకప్పుడు హీరోగా మెప్పించిన వడ్డే నవీన్..  కొంత గ్యాప్ తర్వాత మళ్లీ హీరోగా కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. ‘ట్రాన్స్‌‌‌‌ఫర్ త్రిమూర్తులు’టైటిల్‌‌‌‌తో రూపొందుతున్న చిత్రంలో ఆయన లీడ్‌‌‌‌ రోల్‌‌‌‌ చేయడంతో పాటు కథ, స్క్రీన్‌‌‌‌ప్లే అందిస్తూ వడ్డే క్రియేషన్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నిర్మిస్తున్నారు.

కమల్ తేజ నార్ల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది. రాఖీ పండుగ సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది.

ఇందులో ఆయన కానిస్టేబుల్‌‌‌‌గా కనిపించాడు. రాశీ సింగ్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో రఘు బాబు, బాబా మాస్టర్, శిల్పా తులస్కర్, దేవి ప్రసాద్,  శివ నారాయణ, ప్రమోదిని, గాయత్రి భార్గవి, రేఖా నిరోష ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నాడు.

వడ్డే నవీన్ సినిమాలు:

90-2000వ దశకంలో తెలుగు సినీరంగంలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలలో వడ్డే నవీన్ ఒకరు. వరుస హిట్స్ తో రాణించారు. అందులో 'పెళ్లి', 'కోరుకున్న ప్రియుడు', 'స్నేహితులు', 'మ‌నసిచ్చి చూడు', 'చాలా బాగుంది', 'నా హృదయంలో నిదురించే చెలి', 'ప్రేమించే మ‌న‌సు', 'మా బాలాజీ', 'బాగున్నారా' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా 2016లో 'ఎటాక్' అనే సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించారు. ఇప్పుడు హీరోగా రీఎంట్రీతో స్ట్రాంగ్ ఇస్తున్నారు. ఎలాంటి విజయం అందుకోనున్నారో చూడాలి.

►ALSO READ | తీవ్రరూపం దాల్చిన సినీ కార్మికుల సమ్మె.. నిర్మాతల వైఖరిపై 7వ రోజు భారీ ఆందోళనలు..