
ఓ మహిళకు తన నెలసరి శాపంగా మారింది. పెళ్లిరోజు నెలసరి విషయాన్ని దాచిపెట్టినందు కోర్ట్ మెట్లెక్కాడో భర్త. ప్రస్తుతం ఈ కేసు సోషల్ మీడియాలో హాట్ టాపిగ్గా మారింది. గుజరాత్ కు చెందిన భార్య- భర్తలు ఫ్యామిలీ కోర్ట్ ను ఆశ్రయించారు. ఈ సందర్భంగా భర్త.., జడ్జిగారూ నా భార్య పెట్టే చిత్రహింసలు తట్టుకోలేను ..విడాకులు ఇప్పించండని వేడుకున్నాడు . పెళ్లి రోజు టెంపుల్ కి వెళితే.., గుడిబయటే ఉంది. ఎందుకలా అని ప్రశ్నిస్తే నెలసరి దాచిపెట్టింది. దాంతో మొదలైన గొడవ విడాకులకు దారి తీసింది. నేను ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా.., నా భార్య టీచర్ గా పనిచేస్తుంది. నాకు వచ్చే జీతం అంతంత మాత్రమే. నా భార్య గొంతెమ్మ కోరికలు తీర్చలేకపోతున్నా. నెలకు 5వేలు ఇవ్వాలి. ఇంట్లో ఏసీ పెట్టించాలి. పెళ్లి రోజు తన కోరికలు తీర్చకపోతే 10మందితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంటానని బెదిరించింది. ఆమె చెప్పిన కోరికలను తీర్చడం తన వల్ల కాదని చెప్పడంతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వెళ్లిపోయేదని పిటిషన్‌లో వివరించాడు. ఆమె మాటలను పట్టించుకోకుండా కలిసి ఉండేందుకు ప్రయత్నించినప్పటికీ గొడవలు మాత్రం ఆగడం లేదన్నాడు. ఒక రోజైతే టెర్రస్ మీద నుంచి దూకి చనిపోతానని భయపెట్టిందని చెప్పాడు. ఆమెతో వేగలేనని ఎలాగైనా విడాకులు ఇప్పించమని కోరాడు