రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ నిలిపివేత

రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ నిలిపివేత

రాష్ట్రవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ నిలిపేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ నిబంధనల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై రోజుకు 10 నుంచి 15 ఆపరేషన్స్ మాత్రమే చేసేలా ఆదేశాలు జారీ చేయనున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ చెప్పారు. ఇకపై సిస్టమేటిక్ పద్ధతిలో ఆపరేషన్లు నిర్వహిస్తామని అన్నారు. 

ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనపై అజయ్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం 17 మంది బాధితులు నిమ్స్ హాస్పిటల్ లో అబ్జర్వేషన్ లో ఉన్నారని చెప్పారు. వారిలో ఒకరికి ఇన్ఫెక్షన్ ఉందని, మిగతావారి ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. ఘటనలో మృతిచెందిన వారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేందుకు ఇంకొంచెం టైం పడుతుందని అది వచ్చాక ఒక నిర్థారణకు వస్తామని అజయ్ కుమార్ స్పష్టం చేశారు.