జూబ్లీహిల్స్ టీటీడీ: వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి

జూబ్లీహిల్స్ టీటీడీ: వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి

హైదరాబాద్: జూబ్లీహిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం (డిసెంబర్23) నాడు  ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ పర్వ దినం సందర్భంగా పూల అలంకరణ తో ముస్తాబైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా  తెల్లవారు జామునుంచే ఉత్తర ద్వారా దర్శనాలు కల్పించనున్నారు.

వైకుంఠ ద్వారా దర్శనాన్ని భక్తులు అదృష్టంగా భావిస్తారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.