తెరుచుకున్న వైష్ణో దేవి ఆలయం

తెరుచుకున్న వైష్ణో దేవి ఆలయం

రోజుకు 2 వేలమందికే అనుమతి

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటైన వైష్ణో దేవీ ఆలయం ఆదివారం తెరుచుకుంది. ఉదయం 6 గంటలకు 12 మంది సభ్యుల ఫస్ట్ బ్యాచ్ వైష్ణో దేవిని దర్శించుకుంది. కరోనా కారణంగా ముందు జాగ్రత్త చర్యగా మార్చి 18 నుంచి ఈ ఆలయాన్ని మూసేశారు. ఐదు నెలల తర్వాత ఈ టెంపుల్ తెరుచుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు 12 మంది భక్తుల టీం ఆలయానికి చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వస్తే టెస్టులు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ బోర్డు ఏర్పాట్లు చేసింది. తొలి వారంలో రోజుకు 2 వేల మందినే అనుమతిస్తారు. ఆన్ లైన్ లో రిజిస్టర్ చేసుకున్నోళ్లనే లోపలికి అనుమతిస్తున్నారు. పదేండ్లలోపు పిల్లలు, గర్భిణులు, 60ఏండ్లు పైబడినోళ్లు యాత్రకు దూరంగా ఉండాలన్నారు.