
డిచ్పల్లి, వెలుగు: నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీగా ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కాలిజియేట్ ఎడ్యుకేషన్ ఇన్చార్జి కమిషనర్ వాకాటి కరుణను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల వరకు వర్సిటీ వీసీగా ఉన్న రవీందర్ గుప్తా ఒక డిగ్రీ కాలేజీకి సెంటర్ కేటాయించే విషయంలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగతి తెలిసిందే. గత నెల17న ఆయనను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అప్పటి నుంచి యూనివర్సిటీకి వీసీ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతుండగా కొత్త వీసీగా కరుణను నియమించారు.