V6 News

వాలీబాల్ పోటీలోని ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో.. వాలీ మూవీ

వాలీబాల్ పోటీలోని ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో.. వాలీ మూవీ

రోనిత్ జీఆర్‌‌‌‌‌‌‌‌జీ హీరోగా పరిచయం అవుతూ, నిపుణ్ సత్య కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘వాలీ’. జి విక్రమ్ రెడ్డి సమర్పణలో ఫైర్‌‌‌‌‌‌‌‌వాటర్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి  దిలీప్ కె. మనుకొండ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదివారం ఈ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేస్తూ, దర్శకుడు క్రిష్ జాగర్లమూడి  ఫస్ట్ లుక్ మోషన్  పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పారు.  తీరప్రాంత  గ్రామీణ నేపథ్యంలో సాగనున్న ఈ సినిమా, ఇద్దరు అన్నదమ్ముల జీవితాలను చూపిస్తూ,  వాలీబాల్ గేమ్‌‌‌‌‌‌‌‌లోని  పోటీని ఎమోషన్స్‌‌‌‌‌‌‌‌తో,  హ్యూమన్ రిలేషన్స్‌‌‌‌‌‌‌‌ను రిఫ్లెక్ట్ చేసేలా ఉంటుందని దర్శక నిర్మాతలు తెలియజేశారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ఉప్పాడ  పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా  చిత్రీకరణ పూర్తయ్యిందని,  ప్రస్తుతం  పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని అన్నారు. ఈ చిత్రంలో అభిగ్న్య  వుత్తలూరు హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. రవి వర్మ, కల్పలత, వడ్లమాని శ్రీనివాస్, లక్ష్మణ్ మీశాల, కిరణ్ వారణాసి, రమణ భార్గవ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.   జి రోహన్ రెడ్డి నిర్మిస్తుండగా, శ్రీనివాస్ కారంకి సహ నిర్మాతగా  వ్యవహరిస్తున్నారు.