సర్ధార్​  వల్లభాయ్​ పటేల్​.. పోటీ పరీక్షల ప్రత్యేకం

సర్ధార్​  వల్లభాయ్​ పటేల్​.. పోటీ పరీక్షల ప్రత్యేకం

పటేల్​.. బాంబే ప్రెసిడెన్సీలోని గుజరాత్​లో గల నడియాడ్​లో 1875 అక్టోబర్​ 31న జన్మించారు. బొంబాయిలో 1950 డిసెంబర్​ 15న మరణించారు. వల్లభాయ్​ పటేల్​ న్యాయవృత్తి నిర్వర్తించారు. 

బిరుదులు

సర్ధార్​ (బార్దోలి సత్యాగ్రహ సమయంలో), భారతదేశ ఉక్కు మనిషి . ఇండియన్​ బిస్మార్క్​, ప్యాట్రన్​ సెయింట్​ ఆఫ్​ ఇండియా సివిల్​ సర్వెంట్స్​
ఇతను రాసిన గ్రంథాలు, ఐడియాస్​ ఆఫ్​ నేషన్​ (ఇంగ్లీష్​), భారత్​ విభజన్​ (హిందీ)
సర్ధార్​ వల్లభాయ్​ పటేల్​ స్వాతంత్ర్య  భారతదేశ మొదటి హోంమంత్రి, ఉప ప్రధానిగా కూడా వ్యవహరించారు. పటేల్​ జన్మదినమైన అక్టోబర్​ 31న రాష్ట్రీయ ఏక్తా దివస్​గా 2014 నుంచి జరుపుతున్నారు. ఈయన గుర్తింపుగా కెవడియా వద్ద నర్మదా నదిపై సర్ధార్​ సరోవర్​ డ్యాం దగ్గర విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్​ యూనిటీ పేరుతో నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్మించింది. ఇది ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉంది. 

మూడు జాతీయ పార్టీల హోదా రద్దు

దేశంలో జాతీయ పార్టీల గుర్తింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. తృణమూల్​ కాంగ్రెస్​, ఎన్​సీపీ, సీపీఐల జాతీయ హోదాను ఈసీ ఉపసంహరించుకుంది. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్​, బీఎస్పీ, సీపీఎం, నేషనల్​ పీపుల్స్​ పార్టీలకు జాతీయ హోదా ఉంది.  ఓ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో ఆరు శాతం ఓట్లు సాధించాలి. ఆ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో లేదంటే లోక్​సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో ఈ మేరకు ఓట్లైనా వచ్చి ఉండాలి. నాలుగు ఎంపీ సీట్లను సైతం గెలవాలి. లేదా లోక్​సభ సాధారణ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో 2శాతం స్థానాల్లో విజయం సాధించాలి.