
బుధవారం (అక్టోబర్ 17) వాల్మీకి జయంతిని పురస్కరించుకొని దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు.. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించాయి. నివేదికల ప్రకారం, నోయిడా, గ్రేటర్ నోయిడా మరియు ఘజియాబాద్‌లోని అన్ని పాఠశాలలు అక్టోబర్ 17న మూసివేయబడతాయని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌తో సహా ఇతర రాష్ట్రాలు వాల్మీకి మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకుని సెలవులు ప్రకటించాయి.