వామన్‌రావు దంపతుల హత్యలో మాజీ మంత్రి హస్తం

V6 Velugu Posted on May 08, 2021

మంథనిలో హత్యకు గురైన లాయర్ వామన్‌రావు దంపతుల హత్యపై వామన్‌రావు తండ్రి కిషన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకు, కోడలు హత్య కేసులో ఓ మాజీ మంత్రి హస్తముందని ఆయన ఆరోపించారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే చాలామంది పేర్లు బయటకొస్తాయని ఆయన అన్నారు. తన కొడుకు, కోడలు హత్యవిషయంలో పుట్టా మధుకు ఓ మాజీ మంత్రి సహకరించారని ఆయన అన్నారు. అంతేకాకుండా ఈ హత్య ఉదంతంలో గ్రామ, మండల, జిల్లా, మరియు హైదరాబాద్ స్థాయిలో చాలామంది పాత్ర ఉందని ఆయన అన్నారు. దాడి జరిగిన సమయంలో తీవ్రంగా గాయపడ్డ తన కొడుకుకు సరైన వైద్యం అందించి ఉంటే బతికేవాడని ఆయన అన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆస్పత్రికి ఫోన్ చేసి వైద్యం చేయనివ్వలేదని ఆయన ఆరోపించారు. ఈ కేసు విషయంలో సరైన విధంగా దర్యాప్తు జరపకపోతే కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కోరారు. 

Tagged Telangana, Gattu Vamanrao, Putta Madhu, Lawyer couple murder, Kishanrao, Manthani lawyer couple murder, ex minister involved in Vamanrao couple\'s murder

Latest Videos

Subscribe Now

More News