సాగునీటిని అందించి రూపురేఖలు మారుస్తా : వంశీ చంద్ రెడ్డి

సాగునీటిని అందించి రూపురేఖలు మారుస్తా : వంశీ చంద్ రెడ్డి
  •     సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీ చంద్ రెడ్డి

ధన్వాడ, వెలుగు : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించి గెలిపిస్తే, నారాయణపేట–కొడంగల్​ ఎత్తిపోతల ప్రాజెక్టుతో సాగునీటిని అందించి జిల్లా రూపురేఖలు మారుస్తానని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్​రెడ్డి తెలిపారు. పాలమూరు న్యాయయాత్రలో భాగంగా ఆదివారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం గున్ముక్ల, కంసాన్ పల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ధన్వాడలో నిర్వహించిన కార్నర్​ మీటింగ్​లో ఆయన మాట్లాడుతూ ధన్వాడ డిగ్రీ కాలేజ్  బిల్డింగ్​ నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తామన్నారు.

నారాయణపేట జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, పరిశ్రమలు తెప్పించి అందరికీ ఉపాధి కల్పిస్తామన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకొని జిల్లా అభివృద్ధికి పాటుపడదామని పేర్కొన్నారు.  ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ ధన్వాడ పెద్ద చెరువుకు కృష్ణా నుంచి నీళ్లు తెప్పించి ఆయకట్టదారులను నీరు ఇస్తామన్నారు. 30 పడకల ఆసుపత్రి, బీసీ కాలనీ నుంచి పెట్రోల్  బంక్  వరకు డివైడర్ ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామన్నారు. ధన్వాడ పెద్ద చెరువు, నారాయణపేట చెరువుకు నీళ్లు తెచ్చి సాగు

తాగునీటిని అందిస్తామని చెప్పిన మాజీ ఎమ్మెల్యే నీళ్లను తెచ్చాడా? అని ప్రశ్నించారు. డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల శివకుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రసన్న రెడ్డి, బండి వేణుగోపాల్, వెంకట్రాంరెడ్డి, చిట్టెం సత్యారెడ్డి, నరహరి, రహిమాన్ ఖాన్, నిరంజన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఆనంద్ గౌడ్, క్రాంతి పాల్గొన్నారు.