
- వనస్థలిపురం విజయపురి కాలనీలో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: బండరాయితో తలపై కొట్టి భార్యను భర్త హత్య చేసిన ఘటన వనస్థలిపురం పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మునగనూరుకు చెందిన బాలకోటయ్య(40)కు వనస్థలిపురం విజయపురి కాలనీకి చెందిన శాలిని(35)తో 15 ఏండ్ల పెండ్లి కగా.. వీరికి ఇద్దరు కుమారులు. ప్రస్తుతం వీరి కుటుంబం విజయపురి కాలనీలో ఉంటుండగా కోటయ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు.
కొద్ది రోజులుగా దంపతులు గొడవ పడుతుండగా.. శాలిని ఇద్దరు పిల్లలతో కలసి తన పుట్టింట్లో ఉంటుంది. బాలకోటయ్య హయత్ నగర్లో ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి 9:30 గంటలకు శాలిని విజయపురికాలనీలో ఉండే తన చెల్లి ఇంటికి వెళ్లోంది. అప్పటికే అక్కడ రెక్కీ వేసిన కోటయ్య భార్యను అడ్డగించాడు. బండరాయితో ఆమె తలపై కొట్టి చంపి పరారయ్యాడు.
స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని అడిషనల్ డీజీపీ కోటేశ్వరరావు, ఏసీపీ భీంరెడ్డి పరిశీలించారు.