కెనడాలో బతుకమ్మ సంబురం

కెనడాలో బతుకమ్మ సంబురం

కెనడాలోని వాంకోవర్‌ తెలుగు కమ్యూనిటీ(వీటీసీ) సభ్యులు శనివారం బతుకమ్మ పండుగను ఘనంగా జరిపారు. సర్రేలోని ఫ్రేజర్ హైట్స్ సెకండరీ స్కూల్ లో బతుకమ్మను ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకలో మహిళలు, పిల్లలు సంప్రదాయ దుస్తులు ధరించి.. బతుకమ్మ పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ తెలంగాణ సంస్కృతిని చాటారు.