వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం

వందే భారత్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం

ప్రధాని నరేంద్రమోడీ గతవారం ప్రారంభించిన గాంధీనగర్ – ముంబయి సెంట్రల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ముంబయి సెంట్రల్ నుంచి గాంధీనగర్ కు బయలు దేరిన ట్రైన్ కు రైల్వే ట్రాక్ పై బర్రెలు అడ్డురావడంతో ప్రమాదం జరిగింది. వాత్వా, మణి నగర్ మధ్యలో ఉదయం 11.15గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ఇంజిన్ ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నట్లు వెస్ట్రన్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.

అక్టోబర్ 30న ప్రధాని నరేంద్రమోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించారు. గుజరాత్ రాజధాని గాంధీ నగర్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయి మధ్య ఈ రైలు నడుస్తోంది. 16 కోచులు ఉన్న ఈ ట్రైన్ లో 1,128 మంది ప్యాసింజర్లు ప్రయాణించే అవకాశముంది.