అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌‌‌‌గా వనితా గుప్తా

అమెరికా అసోసియేట్ అటార్నీ జనరల్‌‌‌‌గా వనితా గుప్తా
ఇండో అమెరికన్ సివిల్ రైట్స్ లాయర్ కు థర్డ్ ర్యాంక్ పదవి ఆమె ఇండియన్ల ముద్దు బిడ్డ అని బైడెన్ ప్రశంస వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వంలో మరో ఇండియన్ అమెరికన్ కు కీలక పదవి దక్కింది. యునైటెడ్ స్టేట్స్ అసోసియేట్ అటార్నీ జనరల్ గా ప్రముఖ ఇండియన్ అమెరికన్ లాయర్ వనితా గుప్తా(46)ను నామినేట్ చేసినట్లు కొత్త ప్రెసిడెంట్ బైడెన్ గురువారం విల్మింగ్టన్ లో ప్రకటించారు. సెనేట్ ఆమోదం తర్వాత ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ‘‘జస్టిస్ డిపార్ట్ మెంట్ లో నెంబర్ త్రీ జాబ్ అయిన అసోసియేట్ అటార్నీ జనరల్ గా వనితా గుప్తాను నామినేట్ చేస్తున్నా. ఆమె కొద్దికాలంగా నాకు తెలుసు. అమెరికాలో సమానత్వం కోసం పోరాడిన వనిత ఇండియన్ ఇమిగ్రెంట్ల ప్రౌడ్ డాటర్. ఆమె అమెరికాలోనే మోస్ట్ రెస్పెక్టెడ్ సివిల్ రైట్స్ లాయర్లలో ఒకరు” అని బైడెన్ మెచ్చుకున్నారు. తొలి ఇండో అమెరికన్ మహిళ.. వనిత ఫిలడెల్ఫియాలో1974లో జన్మించారు. తల్లిదండ్రులు ఇండియా నుంచి అమెరికాకు వలస వెళ్లారు. యేల్ యూనివర్సిటీ, న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్​లాలో చదువుకున్నారు. అసోసియేట్ అటార్నీ జనరల్ గా వనిత అటార్నీ జనరల్, డిప్యూటీ అటార్నీ జనరల్ కు సివిల్ జస్టిస్, ఫెడరల్, లోకల్ లాస్, పబ్లిక్ సేఫ్టీ అంశాలపై సహకారం అందిస్తారు. ఆమె ప్రస్తుతం ‘సివిల్, హ్యూమన్ రైట్స్ పై లీడర్షిప్ కాన్ఫరెన్స్’కు ప్రెసిడెంట్, సీఈవోగా ఉన్నారు. సెనేట్ ఆమోదం తెలిపితే ఈ పదవిలో నియమితులైన తొలి ఇండియన్ అమెరికన్ మహిళ అవుతారు.