
హైదరాబాద్, వెలుగు: జెన్‌కోకు నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులైన ఎస్. హరీశ్‌ను విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం (వీఏఓఏటీ) మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. మంగళవారం అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీ అంజయ్య ఆధ్వర్యంలో ప్రతినిధులు హరీశ్‌ను కలిసి ఆయన నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆయన సమర్థ నిర్వహణలో జెన్‌కో లక్ష్యాలను సాధించగలదని పేర్కొన్నారు.
నూతన సీఎండీ నాయకత్వంలో జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి సంస్థలను మరింత బలోపేతం చేస్తుందని, విద్యుత్ రంగంలో కీలక సంస్కరణలు తీసుకువస్తారని అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు. నూతన సీఎండీ హరీశ్‌కు మొక్కను అందించి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నాజర్ షరీఫ్, జాయింట్ సెక్రటరీలు పరమేష్, స్వామి, ఫైనాన్స్ సెక్రటరీ అనిల్, కొరడాల వెంకటేశ్వర్లు, అపర్ణ, మధుసూధన్, రామారావు, రాజశేఖర్తదితరులు పాల్గొన్నారు.