Madharasi: ‘వర.. వర.. వరదల్లే’ వీడియో సాంగ్ రిలీజ్.. అనిరుధ్ మార్క్ మెలోడీ విన్నారా?

Madharasi: ‘వర.. వర.. వరదల్లే’ వీడియో సాంగ్ రిలీజ్.. అనిరుధ్ మార్క్ మెలోడీ విన్నారా?

డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్ ‘మదరాసి’. శివ కార్తికేయన్, రుక్మిణీ వసంత్ జంటగా నటిస్తున్నారు. సెప్టెంబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఇవాళ (ఆగస్టు 24న) సాయంత్రం 7గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. దానికంటే ముందే ఓ బ్యూటిఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసి ఆడియన్స్లో క్రేజీనెస్ పెంచారు మేకర్స్.

‘వర.. వర.. వరదల్లే’ సాగే ఈ పాటను అనిరుధ్‌ స్వరపరచగా, తెలుగులో రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ అందించారు. ఆదిత్య ఆర్‌.కె. పాడారు. అనిరుధ్ మార్క్ మెలోడీ ఆడియన్స్ హమ్ చేసుకునే విధంగా ఉంది. ఇందులో శివకార్తికేయన్‌‌‌‌ కంప్లీట్ క్లాస్ లుక్‌‌‌‌లో కనిపిస్తూ.. తనదైన స్టెప్పులేసి ఆకట్టుకుంటున్నారు. రుక్మిణీ వసంత్ డీసెంట్ లుక్లో కనిపిస్తుంది.

ఈ క్రమంలో సాయంత్రం రిలీజ్ కానున్న ట్రైలర్ కంప్లీట్ మాస్ యాక్షన్గా రానుందని టాక్. ఈ సినిమాలో విద్యూత్ జమ్మ్వాల్, బిజు మీనన్, విక్రాంత్‌‌‌‌లను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీలక్ష్మీ మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ స్కేల్‌‌‌‌లో రిలీజ్ చేస్తుంది.

ఇటీవలే, డైరెక్టర్ మురుగదాస్ కండల వీరుడు సల్మాన్ ఖాన్తో సికిందర్ తీసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ఈ 'మదరాసి' సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. శివకార్తికేయన్ కెరీర్‌‌‌‌లో ఇది 23వ సినిమాగా రానుంది. అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్ ఈ సినిమా తర్వాత, పరాశక్తి మూవీతో రానున్నారు.