వారసుడు చిత్రం నుంచి కొత్త పాట

వారసుడు చిత్రం నుంచి కొత్త పాట

కోలీవుడ్ స్టార్ విజయ్, రష్మిక జంటగా వంశీపైడిపల్లి రూపొందిస్తున్న చిత్రం ‘వారసుడు’. దిల్ రాజు, పీవీపీ కలిసి తెలుగు, తమిళ భాషల్లో  నిర్మిస్తున్నారు. శరత్‌‌‌‌కుమార్, ప్రభు, ప్రకాష్  రాజ్, జయసుధ, సంగీత ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.  సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసిన మేకర్స్ తమిళంలో ‘రంజితమే’ అనే ఫస్ట్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బుధవారం తెలుగు వెర్షన్ పాటను విడుదల చేశారు. ‘బొండుమల్లె చెండూ తెచ్చా, భోగాపురం సెంటూ తెచ్చా.. కళ్లకేమో కాటుక తెచ్చా, వడ్డానం నీ నడుముకిచ్చా’ అంటూ సాగే పాటలో  విజయ్‌‌‌‌, రష్మిక రొమాంటిక్ లుక్స్‌‌‌‌తో మెస్మరైజ్ చేస్తున్నారు.  తమన్ కంపోజ్ చేయగా, రామజోగయ్య శాస్త్రి  లిరిక్స్ రాశారు. ‘రంజితమే రంజితమే వయసు వాస్తు రంజితమే.. సున్నితమే సున్నితమే నీ సొగసు కాస్త సున్నితమే’ అంటూ అనురాగ్ కులకర్ణి, ఎమ్‌‌‌‌.ఎమ్‌‌‌‌ మానసి కలిసి పాడిన విధానం ఆకట్టుకుంది.  జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో విజయ్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్ హైలైట్‌‌‌‌గా నిలిచాయి.