
విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి రూపొందించిన చిత్రం ‘వారసుడు’. రష్మిక హీరోయిన్. దిల్ రాజు, శిరీష్, పీవీపీ కలిసి నిర్మించిన ఈ చిత్రం తమిళంలో ‘వారిసు’ పేరుతో ఈ నెల 11న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో శనివారం రిలీజ్ అవుతున్న సందర్భంగా టీమ్ గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించింది. దిల్ రాజు మాట్లాడుతూ ‘సినిమా మొదలుపెట్టినప్పట్నుంచీ కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అనుకున్నట్టే తమిళంలో ట్రెమండెస్ రెస్పాన్స్ రావడం గర్వంగా ఉంది. సక్సెస్ అంటే డబ్బే కాదు, అదొక ఎమోషన్. ఇప్పుడు దాన్నే మేమంతా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ‘వారసుడు’ కూడా అదే రేంజ్‌లో హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘కుటుంబ విలువలు తెలియజేసే సినిమా ఇది. ఈ కథను విజయ్‌తో చేస్తున్నామని దిల్ రాజు గారు చెప్పగానే టెన్షన్ మొదలైంది. కానీ సినిమా విడుదలై థియేటర్‌లో ప్రేక్షకులు క్లాప్స్ కొడుతుంటే మంచి సినిమా తీశామనే ఫీలింగ్ కలిగింది. సినిమాని గెలవడానికి చూడకండి. ప్రేమించడానికి చూడండి’ అని చెప్పాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి తమిళంలో సక్సెస్ రావడం ఆనందంగా ఉందన్నారు శరత్‌కుమార్. ‘నా కెరీర్ సెకెండ్ ఇన్సింగ్స్‌ను దిల్ రాజు గారికి డెడికేట్ చేసేశాను. ఆయన బ్యానర్‌లో ఇప్పుడు మరో సూపర్ హిట్ అందుకున్నాను. వంశీ పైడిపల్లి కథల్లో పార్ట్ అవడం హ్యాపీ’ అన్నారు జయసుధ. నటులు శ్రీకాంత్, ‘కిక్’ శ్యామ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పాల్గొన్నారు.