మున్సిపాలిటీలో నీటి ఎద్దడి .. వర్ధన్నపేటలో నాలుగు రోజులుగా ప్రజల కష్టాలు

మున్సిపాలిటీలో నీటి ఎద్దడి .. వర్ధన్నపేటలో నాలుగు రోజులుగా ప్రజల కష్టాలు

వర్ధన్నపేట,వెలుగు:  వరంగల్​జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీలో  కొన్ని వార్డుల్లో  నీళ్లు రాక నాలుగురోజలు అవుతుంది.  1వార్డులో   నీళ్లు రాక పోవడంతో  ప్రజలు అధికారులను నిలదీయడంతో మరుసటిరోజు  నీళ్లు సప్లయ్​ చేశారు.  ఇప్పుడు డీసీసీ బ్యాంకు దగ్గర పైపులైన్​ పగలగా.. దానిని రిపేర్​ చేయకుండా వదిలేశారు. దీంతో    9 వార్డులో నీళ్లు రాక నాలుగు రోజులవుతోంది.   

11 వార్డులో   మోటర్​ కాలి 6 నెలలు కావస్తున్న  అధికారులు పట్టించుకోవడంలేదు. యాదవ కాలనీ పైపు లైన్​పగిలి పోయినా రిపేర్లు చేయలేదు.   వెంటనే అధికారులు స్పందించి రిపేర్లు చేసి, నీటి సమస్యలు రాకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.