పిల్లల కోసం వెరైటీ మాస్క్​లు

V6 Velugu Posted on Jun 23, 2021

పిల్లలకు మాస్క్​ పెట్టుకోవాలంటే చిరాకు వస్తుంది. కాసేపు పెట్టుకోగానే తీసేస్తారు. ఇంట్లో ఉంటే ఫర్వాలేదు. కానీ త్వరలో స్కూల్స్​ ఓపెన్​ అవుతాయి. పిల్లలు బయటికి రావాల్సిందే. అలాంటప్పుడు మాస్క్​ పెట్టుకోకపోతే చాలా రిస్క్. అందుకే ఇలాంటి మాస్క్​ కొనిస్తే వాళ్లే అడిగి మరీ పెట్టించుకుంటారు. చూడ్డానికి బొమ్మలతో అందంగా అలరిస్తున్న ఈ మాస్కుల్ని కాటన్​తో చేశారు. వీటివల్ల రెండు లాభాలు. ఒకటి మాస్క్ , రెండోది చెవుల్లోకి చల్లగాలి దూరకుండా, దుమ్ము పడకుండా కాపాడుతుంది. వీటిని ఉతుక్కుని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. ఇంకోటి కార్టూన్ మాస్క్, ఇవి ఫేస్​ మొత్తాన్ని కవర్ చేస్తాయి. పైగా వీటికి మ్యాచింగ్​ కళ్లజోడు కూడా మాస్క్​కి కలిపే ఉంటుంది. ఇంకా తినడానికి, తాగడానికి వీలుగా జిప్​ మాస్క్​లు, ఎండ తగలకుండా టోపీ, దానికి అటాచ్ చేస్తూ ఫేస్​ మొత్తం కవర్ అయ్యేలా ఫేస్​ షీల్డ్.. ఇలా బోలెడు వెరైటీలు ఉన్నాయి. అవి పిల్లలకే కాదు పెద్దలకు కూడా. కావాలంటే వాటిని ఆన్​లైన్​​లో కొనుక్కోవచ్చు. 

Tagged children, schools, corona, masks,

Latest Videos

Subscribe Now

More News