ఈ కూల్ కూల్ వెదర్లో పన్నీర్తో వెరైటీ వంటకాలు చేసుకుని తింటే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. పన్నీర్లో ఏమేం పోషకాలున్నాయంటే.. వందగ్రాముల పన్నీర్లో 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 72 కేలరీలు ఉంటాయి. 83 గ్రాముల కాల్షియం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవాళ్లకి దీన్ని మించిన బెస్ట్ ఆప్షన్ మరొకటి లేదు . పన్నీర్‌లోని గుడ్ ఫ్యాట్స్ కూడా బరువు తగ్గడంలో కీ రోల్ పోషిస్తాయి. అదెలాగంటే.. గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటే శరీరం ఎనర్జీ కోసం దాన్ని ఖర్చుచేస్తుంది. ఫలితంగా బరువు తగ్గొచ్చు. పన్నీర్లో కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి, బాడీ బిల్డింగ్‌కి బెస్ట్ సప్లిమెంట్. వీటిలో ఉండే కాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది. అంతేకాదు బాడీలో పేరుకున్న ఫ్యాట్‌ని కరిగించడానికి సాయం చేస్తుంది.
