హెచ్​సీయూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: విద్యార్థి సంఘాలు

హెచ్​సీయూ విద్యార్థులపై సస్పెన్షన్ ఎత్తివేయాలి: విద్యార్థి సంఘాలు

ఓయూ, వెలుగు: హెచ్ సీయూలోని విద్యార్థులపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్​కాలేజీ వద్ద పలు విద్యార్థి సంఘాల నాయకులు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి మాట్లాడుతూ.. హెచ్​సీయూలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్​తోపాటు మాజీ విద్యార్థి సంఘ నాయకులను, ఎస్ఎఫ్ఐ నాయకులను క్యాంపస్ నుంచి సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. స్టూడెంట్లపై పోలీస్ కేసులు పెట్టడం సరికాదన్నారు. హెచ్​సీయూ వీసీ ప్రొఫెసర్ లాగా కాకుండా రాజకీయ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా విద్యార్థులపై సస్పెన్షన్​ను ఎత్తివేయాలని, లేకుంటే.. చలో హెచ్​సీయూకు పిలుపునిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు రవినాయక్​, శ్రీకాంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు నెల్లి సత్య, ఏఎంఎస్ఏ నాయకులు సైదులు, సీఐటీయూ నాయకులు మహేందర్​ పాల్గొన్నారు