ఆవార్తల్లో నిజంలేదు.. క్లారిటీ ఇచ్చిన వరుణ్, లావణ్య పీఆర్ టీమ్

ఆవార్తల్లో నిజంలేదు.. క్లారిటీ ఇచ్చిన వరుణ్, లావణ్య పీఆర్ టీమ్

మెగా హీరో వ‌రుణ్ తేజ్(Varun tej), లావ‌ణ్య  త్రిపాఠి(Lavanya tripathi) ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నవంబర్‌ 1న ఇటలీలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడకకు మెగా ఫ్యామిలీతో పాటు.. అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. అనంతరం ఆదివారం (నవంబర్‌ 5)న హైదరాబాద్‌లో జరిగిన రిసెప్షన్‌ మాత్రం సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై.. నూతన దంపతులను ఆశ్వీరదించారు.

ఇదిలా ఉంటే.. వరుణ్,లావణ్యల పెళ్లిపై తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే.. వరుణ్‌, లావణ్య పెళ్లి వీడియో ఓటీటీలో ప్రసారం కానుందని, అందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్స్‌ రూ. 8 కోట్ల భారీ అమౌంట్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపించాయి. 

అయితే అది కేవలం పుకారు మాత్రమే అని వరుణ్, లావణ్య పీఆర్ టీమ్ క్లారిటీ ఇచ్చారు. ఈమేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..  వరుణ్‌-లావణ్యల పెళ్లి వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ రూమర్స్. పెళ్లి వీడియో హక్కులను ఏ ఓటీటీకి అమ్మలేదు. దయచేసి ఇలాంటి రూమర్స్‌ని నమ్మకండి.. అని ఓ ప్రకటనలో తెలిపారు.