కానిస్టేబుల్ రిలీజ్ సందర్భంగా.. హ్యాపీడేస్ రోజులు గుర్తొస్తున్నాయి

కానిస్టేబుల్ రిలీజ్ సందర్భంగా.. హ్యాపీడేస్  రోజులు గుర్తొస్తున్నాయి

వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో బలగం జగదీష్ నిర్మించిన చిత్రం ‘కానిస్టేబుల్’. అక్టోబర్ 10న సినిమా  రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌‌‌లో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ‘సమాజంలో జరుగుతున్న  కొన్ని రియల్ ఇన్సిడెంట్స్‌‌‌‌ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం.  

కమర్షియల్, ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్‌‌‌‌తో పాటు మెసేజ్‌‌‌‌ కూడా ఇవ్వబోతున్నాం.   నా కెరీర్‌‌‌‌‌‌‌‌లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం ‘హ్యాపీడేస్’  ఇదే నెలలో విడుదలై  ఘన విజయం సాధించి, నా కెరీర్‌‌‌‌‌‌‌‌ను  మలుపు తిప్పింది.  ఈ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి’  అని అన్నాడు. 

అమ్మాయిలతోపాటు ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇదని దర్శక నిర్మాతలు చెప్పారు.  అర్జున్ అంబటి, కార్తీక్ రాజు, విశ్వ కార్తికేయ తదితరులు ఈ  కార్యక్రమానికి హాజరై సినిమా సక్సెస్ సాధించాలని విష్  చేశారు.