
వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’. బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఆగస్టు 25న సినిమా విడుదలవుతున్న సందర్భంగా సాక్షి మాట్లాడుతూ ‘‘ఏజెంట్’ రిలీజ్‌కు ముందే అందులో కొన్ని షాట్స్ చూసి ప్రవీణ్ నన్ను ఈ మూవీకి సెలెక్ట్ చేశారు. నా పాత్ర పేరు ఐరా. ఇందులో మంత్రిగా కీలకపాత్ర పోషించిన నాజర్ గారితో పక్కనే కనిపించే పాత్ర. పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో కనుక వరుణ్ ఎలా ఉంటాడో అని మొదట్లో భయపడేదాన్ని. కానీ ఆయనే పిలిచి మాట్లాడేవారు.
నాకు ఈ జర్నీలో ఎంతో హెల్ప్ చేశారు. ఇక ప్రవీణ్ గారు సీన్స్ తీసే విధానం క్రియేటివ్‌గా ఉంటుంది. చాలా స్పీడ్‌గా ఈ మూవీ కంప్లీట్ చేశారు. లండన్‌లో షూట్ చేయడం, మంచులో నటించడం కష్టంగా అనిపించలేదు. కానీ డ్రైవింగ్ అంతగా రాకపోవడంతో ఆ సీన్లు చేసేటప్పుడు భయపడ్డా. ఇప్పటికే యాక్షన్ మూవీస్‌లో నటించాను కనుక లవ్ స్టోరీస్‌లో కూడా నటించాలనుంది. ప్రస్తుతం ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో పాటు సాయిధరమ్ తేజ్ గారితో ఓ సినిమా చేస్తున్నా’ అని చెప్పింది.